Trisakthi Dham Temple
పవిత్ర తీర్థయాత్ర స్థలం

శ్రీ
త్రిశక్తి
ధామం

నైమిశారణ్యం

కలి ప్రవేశం చేయని భూమిపై ఏకైక స్థలం. 88,000 భక్తులు జ్ఞానోదయం పొందిన అద్భుత భూమి.

నైమిశారణ్యం, ఉత్తర ప్రదేశ్
స్వాగతం

దివ్య క్షేత్రం

🪷
Temple Deity
Temple Interior
Sacred Space
Lord Vishnu

33+

పవిత్ర ఆలయాలు

నైమిశారణ్యం పవిత్ర భూమి

కలి ప్రవేశం చేయని పుణ్యభూమి, 88 వేల భగవత్ చింతన గల సామాన్య భక్తులను మహర్షులుగా మార్చిన తపోభూమి నైమిశారణ్యం. దర్శించినంతనే జ్ఞానం పొందగలిగిన పవిత్ర ప్రదేశం ఇది. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం హిందూ సంప్రదాయంలో అత్యంత ప్రసిద్ధమైన మరియు ముఖ్యమైన ఆచారాలలో ఒకటి, ఇది సమృద్ధి, శాంతి మరియు కోరికల నెరవేర్పును తెస్తుందని నమ్ముతారు. దీని మూలం నైమిశారణ్యంలో లోతుగా పాతుకుపోయింది. సూత మహర్షి నారద ముని మరియు భగవంతుడు విష్ణువు (సత్యనారాయణ రూపంలో) మధ్య జరిగిన సంభాషణను ఇక్కడ నైమిశారణ్యంలో వివరించారు, భగవంతుడు స్వయంగా ఈ వ్రతం యొక్క విధానం మరియు ప్రాముఖ్యతను వెల్లడించారు. ఈ త్రిశక్తి ధామం విశ్వజనని ఆశీస్సులతో ఇంతటి దివ్యమైన భూమిలో నిర్మించబడింది. నైమిశారణ్యంకు వచ్చే యాత్రికులకు అన్ని రకాల సదుపాయాలు కలుగచేస్తూ, దర్శించలేని భక్తులకు కూడా ఈ సుక్షేత్రం తో అనుభంధం కలుగచేయ గలగడం విశేషమైన సంతృప్తి ఇచ్చే విషయం! సదా భగవానుని సేవలో

గరిమెళ్ళ వెంకటరమణ శాస్త్రి

గరిమెళ్ళ వెంకటరమణ శాస్త్రి

వ్యవస్థాపకుడు & ఆధ్యాత్మిక మార్గదర్శి

🛏️

49 గదులు

🏛️

500 మంది ప్రవచన హాల్

🍽️

అన్నదానం

🙏

సత్యనారాయణ స్వామి వ్రతం

🚗

ప్రయాణ సహాయం

📍

స్థానిక పర్యటన

అన్నదానం "శ్రీ భారతీయ వేద విజ్ఞాన ధర్మ సేవా పరిషద్" ద్వారా

రోజువారీ పూజ

సమయ సూచిక

త్రిశక్తి ధామంలో రోజువారీ పూజలలో పాల్గొని దైవిక ఆశీర్వాదాలను పొందండి

🪔
ఉ. గం. 7:00

అష్టోత్తర దూర్వాయుగ్మ (గరిక) పూజ (శ్రీ వల్లభ గణపతి స్వామి వారికి)

ఉ. గం. 7:30 – 8:30

శ్రీ రుద్రాభిషేకం (శ్రీ నర్మదేశ్వర లింగానికి)

ఉ. గం. 8:00

శ్రీ రమా సత్యనారాయణ స్వామి వ్రతం

ఉ. గం. 11:00 – 12:00

సువర్ణ పుష్ప అష్టోత్తర పూజ (పవిత్ర నాభి గయ లోని శ్రీ మహావిష్ణువు విశేష రూపము, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి)

సా. గం. 7:00 – 8:00

శ్రీ చక్రసహిత విశేష కుంకుమార్చన (వన దుర్గ స్వరూపమైన శ్రీ బాలా త్రిపుర సుందరి దేవికి)

ఆలయ సమయాలు

ఉ. గం. 7:00 – సా. గం. 8:00

ప్రతి రోజు తెరిచి ఉంటుంది

* పండుగలు మరియు ప్రత్యేక సందర్భాలలో సమయాలు మారవచ్చు

⚠️గమనిక: మాకు ఎటువంటి మధ్యవర్తులు లేరు. కావున వసతి బుక్ చేసుకొనుటకు సంప్రదింపుల విభాగంలో గల ఫోన్ నెంబరు ఉపయోగించగలరు.

మా సేవలు

మేము అందించేవి

🕉️

మీ బస బుక్ చేయండి

రిజర్వేషన్ల కోసం నేరుగా సంప్రదించండి

సంప్రదించండి

సంప్రదింపు వివరాలు

🙏

⚠️గమనిక: వసతి బుకింగ్ కోసం మాకు ఎటువంటి మధ్యవర్తులు లేరు. దయచేసి క్రింద ఇచ్చిన వివరాలను ఉపయోగించి నేరుగా మమ్మల్ని సంప్రదించండి.

ఫోన్ నంబర్లు

చిరునామా

త్రిశక్తి ధామం (ఆంధ్ర ఆశ్రమం)
సాయి ధామ్ ఎదురుగా, గోమతి రస్తా
నీమ్సర్, మిస్రిఖ్ మండల్
సీతాపూర్ జిల్లా
ఉత్తర ప్రదేశ్ - 261402
దిశలు పొందండి →